
'పుష్ప 2'తో దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన రానుంది. అయితే తనకు దొరికిన విరామాన్ని ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా దుబాయి వెళ్లిన బన్నీ.. అక్కడే కట్టిన హిందూ దేవాలయాన్ని సందర్శించాడు.
(ఇదీ చదవండి: జపాన్ లో 'దేవర'.. భార్యతో కలిసి వెళ్లిన తారక్)
అబుదాబిలో ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామి నారాయణ్ మందిర్ ని కొన్నాళ్ల క్రితం స్థాపించారు. ఇప్పుడు దీన్నే అల్లు అర్జున్ సందర్శించారు. శనివారం అక్కడికి వెళ్లిన బన్నీకి ఆలయ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజాలు కూడా చేయించారు.
ఇకపోతే ఆలయ ప్రతినిధులు..బన్నీకి ఈ ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల విషయానికొస్తే.. త్వరలో అట్లీతో ఓ మూవీ చేయబోతున్నాడు. దీని తర్వాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా)
Bunny Boyy visits the #AbuDhabiMandir ❤️#AlluArjun pic.twitter.com/PHjmE8FGp9
— Bunny_boy_private (@Bunnyboiprivate) March 22, 2025