Allu Arjun Greets His Fans On His Birthday Special, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun Birthday: అల్లు అర్జున్‌ ఇంటివద్ద భారీగా అభిమానులు.. వీడియో వైరల్‌

Apr 8 2023 11:51 AM | Updated on Apr 8 2023 12:20 PM

Allu Arjun Greets His Fans On His Birthday - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నేడు(శనివారం)41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చినా స్టైలిష్‌ స్టార్‌గా తనకు తాను ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు బన్నీ. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.

తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బన్నీ మొన్నటి పుష్ప సినిమా వరకు తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. పుష్పరాజ్‌గా  పాన్‌ ఇండియా లెవల్‌లో పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక తన ఫ్యాన్స్‌ను ఆర్మీ అని ముద్దుగా పిలిచుకుంటారు బన్నీ.

ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్‌ను కలిసేందుకు పలువురు అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఫ్యాన్స్‌ను ఆప్యాయంగా పలకరించారు బన్నీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement