అల్లు అర్జున్‌ బర్త్‌డే నాడు సూపర్‌ హిట్‌ సినిమా రీ-రిలీజ్‌

Allu Arjun's Birthday Gifts To His Fans - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 8 కోసం ఆయన అభిమానులతో పాటు సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆరోజే ఆయన కొత్త చిత్రం 'పుష్ప 2' టీజర్‌ విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్‌ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది.

బన్నీ పుట్టినరోజున మరో కానుక కూడా ఉంది. తన కెరియర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచిన 'జులాయి' మళ్లీ మీ ముందుకు రానుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో రూపొందిన పాటలు కూడా భలేగా అలరించాయి. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 12 ఏళ్లు దాటింది. అయినా కూడా పాటలు, మాటలతో మెప్పించిన ‘జులాయి’ని ఇప్పుడు చూసినా మంచి కిక్‌ ఇస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8న కొన్ని థియేటర్‌లలో మాత్రమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్‌ చేస్తున్నారు.

ఏప్రిల్‌ 8న బన్నీ నుంచి మరో కానుక వచ్చే అవకాశం ఉంది. స్టార్‌ డైరెక్టర్‌ అట్లీతో సినిమా ప్రకటన కూడా రానుందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో  ఓ సినిమా రూపొందనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్‌ 8న రావచ్చిన తెలుస్తోంది.  తాజాగా అట్లీ భార్య ప్రియా సైతం 'ఏ6' కథా చర్చలు అంటూ ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. 

Election 2024

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top