RRR Movie Update: Alia Bhatt Learning Telugu For the Movie | తెలుగు పాఠాలు నేర్చుకుంటున్న అలియా భట్ - Sakshi
Sakshi News home page

తెలుగు పాఠాలు

Oct 8 2020 1:17 AM | Updated on Oct 8 2020 11:45 AM

Alia Bhatt on learning Telugu for SS Rajamouli RRR - Sakshi

‘మా మాటలు మేమే మాట్లాడుకుంటాం’ అని పరభాషా తారలు తెలుగు సినిమాలు చేసినప్పుడు తమ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తెలుగులో ఫుల్‌ బిజీగా సినిమాలు చేస్తున్న రకుల్‌ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా వంటి ఉత్తరాది భామలు అప్పుడప్పుడూ తమ పాత్రలకు డబ్బింగ్‌ చెబుతున్నారు. అయితే ఓ పది సినిమాలు చేశాక వాళ్లు ఈ ప్రయత్నం చేశారు. కానీ ఆలియా భట్‌ మాత్రం తెలుగులో చేస్తున్న తొలి సినిమాకే తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటున్నారట.

ఎన్టీఆర్, రామ్‌చరణŠ  హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ సరసన సీత పాత్రలో ఆలియా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ సినిమా నుండి ఆలియా తప్పుకున్నారనే వార్తలు షికారు చేశాయి. కానీ ఆలియా తప్పుకోలేదు. సీత పాత్ర కోసం ప్రిపేర్‌ అవుతున్నారు. తెలుగు నేర్చుకోవటం కోసం కోచ్‌ను కూడా పెట్టుకున్నారని టాక్‌. డబ్బింగ్‌ చెప్పుకోవాలని అనుకుంటున్నారట. సోమవారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. నవంబర్‌ నుంచి ఈ సినిమా చిత్రీకరణలో ఆలియా పాల్గొంటారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement