పదిహేడేళ్ల తర్వాత... | Akshay Kumar and Saif Ali Khan reunite to shoot for Priyadarshan Haiwaan | Sakshi
Sakshi News home page

పదిహేడేళ్ల తర్వాత...

Aug 24 2025 4:35 AM | Updated on Aug 24 2025 4:35 AM

Akshay Kumar and Saif Ali Khan reunite to shoot for Priyadarshan Haiwaan

పదిహేడేళ్ల తర్వాత హీరోలు అక్షయ్‌ కుమార్‌–సైఫ్‌ అలీఖాన్‌ ‘హైవాన్‌’ సినిమా కోసం మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఈ హిందీ థ్రిల్లర్‌ సినిమాకు ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్‌ ప్రోడక్షన్స్, తెస్పియన్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై వెంకట్‌ కె. నారాయణ, శైలజా దేశాయ్‌ ఫెన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శనివారం కొచ్చిలో ఆరంభ మైంది.

ఊటీ, ముంబైలలో ఈ సినిమా చిత్రీకరణ జరపుకోనుంది. ఇక విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వంలోని హిందీ చిత్రం ‘తషాన్‌’ (2008)లో అక్షయ్‌ కుమార్‌–సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. మళ్లీ ఇప్పుడు ‘హైవాన్‌’లో ఈ ఇద్దరు స్టార్స్‌ కలిసి నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement