
నాగార్జున కెరీర్‌లోని వందో సినిమా చిత్రీకరణ కోసం కొన్ని రోజులుగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని తెలిసింది. తొలి షెడ్యూల్‌లో నాగార్జున పాల్గొంటున్నారని సమాచారం.
ఈ సినిమాకు ‘కింగ్ 100’, ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్స్‌ను మేకర్స్ అనుకుంటున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే తాజాగా ‘లాటరీ కింగ్’ అనే మరో టైటిల్‌ను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారట. అంతేకాదు.. కథ రీత్యా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.