13 ఏళ్లకు మళ్లీ...

After 13 years again as Ranbir Kapoor to play in Sanjay Leela Bhansali Film - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌ను ‘సావరియా’ (2007) చిత్రం ద్వారా హిందీ పరిశ్రమకు పరిచయం చేశారు దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ. ఆ తర్వాత ఈ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాలేదు. పదమూడేళ్ల విరామం తర్వాత సంజయ్‌ లీలా భన్సాలీ, రణ్‌బీర్‌ కపూర్‌ ఓ సినిమా కోసం కలుస్తున్నారు. ‘బైజూ బావరా’ అనే సినిమా తీయబోతున్నట్టు భన్సాలీ గత ఏడాది ప్రకటించారు.

తాజాగా ఇందులో రణ్‌బీర్‌ హీరోగా నటిస్తారని వార్తలు వచ్చాయి. హీరోయిన్లుగా దీపికా పదుకోన్, ఆలియా భట్‌ నటిస్తారట. ఇందులో మరో హీరో కూడా నటిస్తారని తెలిసింది. రణ్‌బీర్‌కి జోడీగా ఆలియా కనిపిస్తారు. ప్రస్తుతం ఆలియాతో ‘గంగుభాయ్‌ కతియావాడీ’ తెరకెక్కిస్తున్నారు భన్సాలీ. అది పూర్తయ్యాక ‘బైజూ బావరా’ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top