తొలి అడుగు | Sakshi
Sakshi News home page

తొలి అడుగు

Published Sat, Jul 29 2023 6:03 AM

Aditi Rao Hydari to star in Rajesh M Selva next  - Sakshi

ఇటు సౌత్‌.. అటు నార్త్‌.. కాస్త ఖాళీ దొరికితే డిజిటల్‌ వరల్డ్‌... ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటున్నారు హీరోయిన్‌ అదితీరావ్‌ హైదరి. అయితే తొలిసారి ఈ బ్యూటీ ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని కోలీవుడ్‌ సమాచారం.

తమిళ దర్శక–నటుడు రాజేష్‌ ఎమ్‌. సెల్వ ఇటీవల కథానాయిక ప్రాధాన్యంగా సాగే ఓ కథ తయారు చేశారని, ఈ కథ విని, ఇందులోని పాత్ర నచ్చడంతో అదితీరావ్‌ హైదరి పచ్చ జెండా ఊపారని కోలీవుడ్‌ టాక్‌. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ఆరంభం కానుందట. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల పరంగా అదితీకి ఇది తొలి అడుగు. మరి.. ఈ తొలి అడుగుతో ఈ తరహా చిత్రాలు ఇంకెన్ని చేస్తారో చూడాలి. ఇక ‘సమ్మెహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి చిత్రాలతో అదితీరావ్‌ హైదరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 

Advertisement
Advertisement