హీరోయిన్ తాప్సీ.. సీక్రెట్‌గా ప్రియుడితో పెళ్లికి సిద్ధమైందా? | Actress Taapsee Pannu Wedding With Boyfriend Mathias Boe In March 2024? Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Taapsee Pannu Marriage News: అంత సింపుల్‌గా హీరోయిన్ తాప్సీ పెళ్లి.. వేదిక అదేనా?

Feb 28 2024 7:26 AM | Updated on Feb 28 2024 8:53 AM

Actress Taapsee Wedding With Boyfriend Mathias Boe - Sakshi

మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా అంటే అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. మొన్నీమధ్యే రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. తెలుగు హీరో ఆశిష్ కూడా కొన్నిరోజుల క్రితమే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ తాప్సీ కూడా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైందట. ప్రియుడితో రహస్యంగా ఏడడుగులు వేయనుందని సమాచారం. 

(ఇదీ చదవండి: కాబోయే భర్త విజయ్ దేవరకొండలా? రష్మిక ట్వీట్ వైరల్)

ఢిల్లీకి చెందిన తాప్సీ.. 'ఝమ్మంది నాదం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్, స్టార్ హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌గా ఫేమ్ సంపాదించింది. రెండు నెలల క్రితం 'డంకీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సినిమాల సంగతి పక్కనబెడితే తాప్సీ.. గత పదేళ్ల నుంచి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మథియస్ బోతో రిలేషన్‌లో ఉంది. కాకపోతే ఈ విషయం బయటపడకుండా చాలా జాగ్రత్తగా మెంటైన్ చేస్తూ వచ్చింది. గతేడాది తమ బాండింగ్ గురించి అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు అతడితోనే ఏడడుగులు వేయనుందట. సెలబ్రిటీలు ఎక్కువగా ఒక్కటయ్యే ఉదయ్‌పూర్ వీళ్ల పెళ్లికి వేదిక కానుందట. అలానే కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే ఈ వేడుక జరగనుందట. అయితే ఈ పెళ్లిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement