స్వర్గంలో ఉన్నాను! | Sakshi
Sakshi News home page

స్వర్గంలో ఉన్నాను!

Published Thu, Oct 8 2020 12:21 AM

Actress Taapsee Pannu Enjoying In Maldives - Sakshi

కరోనా వల్ల పనికి, ఆ తర్వాత రిలాక్సేషన్‌ కోసం వెళ్లే పిక్‌నిక్‌లకు బ్రేక్‌ పడింది. అయితే లాక్‌డౌన్‌ తీయగానే షూటింగ్‌ ప్రారంభించేశారు తాప్సీ. విజయ్‌ సేతుపతితో కలసి ఓ తమిళ సినిమా చేశారామె. జైపూర్‌లో ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాక వెకేషన్‌కు బయలుదేరారామె. తన సోదరి మరియి స్నేహితులతో కలసి మాల్దీవులు చేరుకున్నారు తాప్సీ.

అక్కడ సేద తీరుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారామె. ‘భూమి మీద స్వర్గం ఉంది అంటే అది కచ్చితంగా మాల్దీవులే అనుకుంటా. నెక్ట్స్‌ కొన్ని రోజులు ఇదే మా ఇల్లు’ అని తాప్సీ అన్నారు. ఈ హాలిడే పూర్తయిన వెంటనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారామె. హిందీలో ‘రాకెట్‌ రష్మీ’ అనే సినిమా చేస్తున్నారు తాప్సీ.

Advertisement
 
Advertisement