
సినీ ఇండస్ట్రీలో క్యౌస్టింగ్ కౌచ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో ఛాన్సుల పేరుతో చాలామందికి ఇలాంటి అనుభవం ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. సినీ ఇండస్ట్రీతో పాటు చాలా చోట్ల క్యాస్టింగ్ కౌచ్ అనే తరచుగా వింటుంటాం. అలా తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెబుతోంది బాలీవుడ్ భామ సుర్వీన్ చావ్లా. తన కెరీర్‌లో కాస్టింగ్ కౌచ్ ఎదురైన చేదు అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. చావ్లా తన వివాహం తర్వాత కూడా జరిగిన కొన్ని చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
ఓ దర్శకుడి కార్యాలయంలో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని సుర్వీన్ చావ్లా. ఒకసారి అతని ఆఫీస్ క్యాబిన్‌లో మీటింగ్ తర్వాత నేను వెళ్తుండగా.. సెండాఫ్ చెప్పేందుకు డోర్ వద్దకు వచ్చాడని తెలిపింది. నాకు వీడ్కోలు చెప్పడానికి తలుపు దగ్గరకు వచ్చి.. తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని ఆ చేదు అనుభవాన్ని వెల్లడించింది. నేను వెంటనే అతన్ని వెనక్కి నెట్టివేశానని తెలిపింది. అతని ప్రవర్తనతో షాక్‌కు గురయ్యానని.. అసలేం ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వివరించింది. అతను నా వ్యక్తిగత జీవితం గురించి.. అలాగే నా భర్త ఏం చేస్తున్నారని అడిగాడని గుర్తు చేసుకుంది.
ఇలాంటి అనుభవం తనకు చాలాసార్లు ఎదురైందని పంచుకుంది. మరోసారి సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్‌తో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని సుర్వీన్ చావ్లా వెల్లడించింది. దక్షిణాదికి చెందిన ఓ దర్శకుడు షూటింగ్ సమయంలో తనతో పడుకోవాలని అడిగాడని వివరించింది. అతనికి హిందీ బాష రాకపోవడంతో ఓ మధ్యవర్తి ద్వారా చెప్పించాడని తెలిపింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదామె.
అంతకుముందు ఇంటర్వ్యూలో ఆడిషన్ల సమయంలో తన బాడీ షేమింగ్‌కు గురైనట్లు సుర్వీన్ చావ్లా పంచుకుంది. పరిశ్రమలోని మహిళలను తక్కువగా చూస్తారని.. దాని కారణంగా మహిళలు తమను తాము తక్కువగా భావిస్తారని అన్నారు. కెరీర్‌లో ఎన్ని అడ్డంకులు ఎదురైన చావ్లా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆమె ఇటీవలే 'క్రిమినల్ జస్టిస్ సీజన్ 4' వెబ్ సిరీస్‌లో కనిపించింది. అంతకుముందు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడులోనూ నటించింది. ప్రస్తుతం ఆమె 'రానా నాయుడు సీజన్ 2'లోనూ కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో రానా దగ్గుబాటి సరసన మెప్పించనుంది.