Is actress Sunaina was kidnapped? Here is the clarity - Sakshi
Sakshi News home page

Sunaina: హీరోయిన్‌ కోసం పోలీసుల గాలింపు.. కిడ్నాప్‌ అయిందా?

May 21 2023 4:19 PM | Updated on May 21 2023 4:35 PM

Is Actress Sunaina kidnapped? Here is The Clarity - Sakshi

కుమార్‌ వర్సెస్‌ కుమారి అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది సునయన.

హీరోయిన్‌ సునయన రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. సునయన కిడ్నాప్‌ అయిందని, పోలీసులు ఆమె గురించి దర్యాప్తు చేస్తున్నారంటూ ఓ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఆచూకీ తెలిసిందని, ఈ కిడ్నాప్‌ అంతా డ్రామా అని, ఇది సినిమా ప్రమోషన్‌లో భాగమేనని తెలుస్తోంది.

మండిపడుతున్న నెటిజన్లు
సునయన ప్రస్తుతం రెజీనా అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డోమిన్‌ సెల్వ డైరెక్ట్‌ చేస్తుండగా సతీశ్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగానే సునయన కనిపించడం లేదంటూ పుకారు లేపారు. ఇది నిజమేనని భావించిన అభిమానులు సునయన కోసం ఆందోళన చెందారు. తీరా ఇదంతా ప్రాంక్‌ అని చెప్పడంతో నెటిజన్లు పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్నారు. అందరినీ కంగారు పెట్టించిన హీరోయిన్‌తో పాటు సినిమా టీమ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎవరీ సునయన..
కుమార్‌ వర్సెస్‌ కుమారి అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది సునయన. ఆ తర్వాత తెలుగులో సమ్‌థింగ్‌ స్పెషల్‌, 10th క్లాస్‌ సినిమాలు చేసింది. కాదలిల్‌ విడుంతేన్‌ అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. నీర్‌ పార్వై, సమర్‌, మాసిలామణి, తేరి, సిలుక్కువార్‌పట్టి తదితర చిత్రాలతో కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నీర్‌ పార్వై సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డు సైతం అందుకుంది. తమిళ బిగ్‌బాస్‌ 4 సీజన్‌లోనూ పాల్గొంది. సునయన చివరగా లాఠీ సినిమాలో విశాల్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం ఆమె రెజీనా చిత్రం చేస్తోంది.

చదవండి: పూజలు, ఉపవాసాలు చేశా.. అయినా ఆ భగవంతుడు కరుణించలేదు: జబర్దస్త్‌ యాంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement