రూట్ మార్చిన హాట్ బ్యూటీ.. ఏకంగా అలాంటి ఫొటోలతో | Actress Ramya Pandian Latest Pics Goes Viral | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోతో సినిమా చేసిన నో లక్.. దీంతో అలా మారిపోయి!

Jan 3 2024 8:55 AM | Updated on Jan 3 2024 9:03 AM

Actress Ramya Pandian Latest Pics Viral - Sakshi

సినిమా హీరోహీరోయిన్ లైఫ్ అంటే జయాపజయాల మధ్య ఊగుతుంటుంది. హిట్‌వస్తే ఒకలా లేదంటే మరోలా ఉంటుంది. అయితే కొందరి విషయంలో హిట్స్ వచ్చినా అవకాశాలు రాకపోవడం జరుగుతోంది. అందుకోసం వాళ్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రముఖ తమిళ నటి రమ్య పాండియన్‌ పరిస్థితి ఇలానే తయారైంది. తొలుత పలు టీవీ సీరియల్స్‌లో నటించిన పాపులర్‌ అయిన ఈమె.. బిగ్‌బాస్‌, కుక్ విత్ కోమలి తదితర రియాల్టీ షోల్లో పాల్గొని ఫేమ్ తెచ్చుకుంది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?)

ఇక ఫుల్ క్రేజ్ రావడంతో సినిమాల్లో అవకాశాలు తలుపుతట్టాయి. అలా 'డమ్మీ పటాస్‌' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది పెద్దగా గుర్తింపు తీసుకురానప్పటికీ దీని తర్వాత 'జోకర్‌' హిట్ అయింది. ఇందులో రమ్య పాండియన్‌ గ్రామీణ యువతిగా నటించి ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రం కూడా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. 

అయితే హిట్ సినిమాలో నటించినప్పటికీ రమ్యకు అవకాశాలు రావడం చాలా కష్టమైపోతుంది. గతేడాది మమ్ముట్టి లాంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో అవకాశాల కోసం రూట్ మార్చింది. అందాలు కనిపించేలా స్పెషల్ ఫొటోషూట్ చేయించి, ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇవి చూసైనా సరే దర్శకనిర్మాతలు ఈమెకి ఛాన్సులు ఇస్తారేమో చూడాలి.

(ఇదీ చదవండి: కేటుగాళ్ల దెబ్బకు మోసపోయిన అవార్డ్ విన్నింగ్ తెలుగు హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement