కేటుగాళ్ల దెబ్బకు మోసపోయిన అవార్డ్ విన్నింగ్ తెలుగు హీరోయిన్ | Sakshi
Sakshi News home page

Anjali Patil: లక్షలు నష్టపోయిన ప్రముఖ నటి.. మరీ అలా భయపెట్టేసరికి!

Published Wed, Jan 3 2024 8:31 AM

Actress Anjali Patil Duped 5 Lakh Rupees Via Parcel Scam - Sakshi

ప్రముఖ నటి మోసపోయింది. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి, నిమిషాల్లో లక్షలు పోగొట్టేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. సామాన్యులు, దీనిపై పెద్దగా ఐడియా లేనివాళ్లు మోసపోయారంటే అనుకోవచ్చు. కానీ మంచి సినిమాలు చేస్తూ అవార్డులు గెలుచుకున్న ఈ నటి కూడా కేటుగాళ్ల వలలో పడి బోల్తా కొట్టేసింది.

ఇంతకీ ఏం జరిగింది?
తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి పాటిల్. తెలుగులో 'నా బంగారు తల్లి' సినిమాలో లీడ్ రోల్ చేసి చాలా పేరు తెచ్చుకుంది. నంది అవార్డు కూడా గెలుచుకుంది. దీని తర్వాత టాలీవుడ్‌లో మరో మూవీ చేయలేదు. ప్రస్తుతానికి హిందీ, మరాఠీలో చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. అయితే తాజాగా ఈమెకి డిసెంబరు 28న దీపక్ శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫెడ్ ఎక్స్ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఈమె పేరుతో ఉన్న ఓ పార్సిల్, డ్రగ్స్‌తో తైవాన్‌లో పట్టుబడిందని అన్నాడు. పార్సిల్‌లోనే ఆధార్ కార్ట్ కాపీ ఉందని చెప్పాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?)

లక్షలు నష్టపోయింది!
తన ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయ్యే అవకాశముందని భయపడిన అంజలి పాటిల్.. ముంబయి సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ని సంప్రదిస్తానని సదరు వ్యక్తితో చెప్పింది. ఇలా జరిగిన కాసేపటికే సైబర్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నానని బెనర్జీ అనే వ్యక్తి.. అంజలికి కాల్ చేశాడు. మీ ఆధార్ కార్డ్.. మూడు బ్యాంక్ ఖాతాలకు కనెక్ట్ అయ్యిందని, అవి మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కుని ఉన్నాయని కాస్త భయపెట్టాడు. ప్రొసెసింగ్ ఫీజ్ అని చెప్పి రూ.96,525 పంపాలని అంజలికి చెప్పగా, ఆమె వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం రూ.4,83,291 డబ్బు పంపాలని అన్నాడు.

అలా డబ్బులు పంపేసిన కాసేపటికి నటి అంజలి పాటిల్.. తాను మోసపోయాననే విషయాన్ని గ్రహించింది. మొత్తంగా రూ.5.79 లక్షల వరకు అంజలి నష్టపోయింది. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా పేరున్న నటి.. సైబర్ కేటుగాళ్ల వలలో పడి మోసపోవడం హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: షూటింగ్‌లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు)

Advertisement
 
Advertisement