Actress Namitha Seemantham Photos, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Namita: గ్రాండ్‌గా హీరోయిన్‌ సీమంతం, ఫొటోలు వైరల్‌

Jun 4 2022 6:36 PM | Updated on Jun 4 2022 7:44 PM

Actress Namita Seemantham Photos Went Viral - Sakshi

తాజాగా నమితకు సీమంతం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం వేడుక నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట

‘సొంతం’, ‘జెమిని’, 'బిల్లా' ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నమిత. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె త్వరలో తల్లి కాబోతోంది. తన బర్త్‌డే రోజు (మే 10) ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించింది. భర్తతో కలిసి బేబీ బంప్‌తో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

తాజాగా నమితకు సీమంతం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం వేడుక నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరగ్గా 41 ఏళ్ల వయసులో ఆమె తల్లి కాబోతుండటం గమనార్హం.

చదవండి: హోటల్‌లో పని చేశాను, అది తెలిసి చిరంజీవి బాధపడ్డాడు, అంతేకాదు
 కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Advertisement
 
Advertisement
Advertisement