అందుకు ఒప్పుకుంటేనే అవకాశాలు.. నటి వివాదాస్పద వ్యాఖ్యలు

Actress Meera Mithun Controversial Comments - Sakshi

నన్ను అరెస్టు చేయలేరు : మీరా మిథున్‌  

సాక్షి, చెన్నై: ఇక్కడి ఇండస్ట్రీలో మగవాడి ఆశలకు లొంగితేనే.. అవకాశాలు దరి చేరుతాయని, అందుకే ఇతర రాష్ట్రాల వారు విజయాలు సాధిస్తున్నారని నటి మీరా మిథున్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నటి, మోడల్, బిగ్‌ బాస్‌ ఫేం మీరా మిథున్‌ వ్యాఖ్యలు రచ్చకెక్కుతున్న విషయం తెలిసిందే. గతవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా ఏడు సెక్షన్లతో కేసులు ఆమె మీద నమోదు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో గురువారం ఆమె విడుదల చేసిన వీడియో  వైరల్‌గా మారడమే కాదు, మరో వివాదాన్ని రేపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నటీమనుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించే వారు ఎక్కువే అయ్యారు. ముందుగా ఆ వీడియోలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం ఎంకే స్టాలిన్‌లకు విజ్ఞప్తి చేస్తూ, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

తమిళనాడు బిడ్డగా, ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళ నైన తాను అనేక ఇబ్బందుల్ని ఇక్కడ ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏది చేసినా, ఏమి చెప్పినా వివాదం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను వేధించిన ఆ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి స్పష్టంగా వ్యాఖ్యలు చేస్తే, దానిని ఓ సామాజిక వర్గాన్ని కించ పరిచినట్లుగా చిత్రీకరించారని వివరించారు. తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాల్ని అడ్డుకోవాలని, ఇందుకు ముగింపు పలికేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, పోలీసుల్ని ఉద్దేశించి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.

తనకు వ్యతిరేకంగా, తన మీద అతి నీచాతి నీచంగా, అసభ్య పదజాలాలతో సామా జిక మాధ్యమాల వేదికగా విమర్శలు, ఆరోపణలు, చర్చలు సాగుతున్నాయని, వీటన్నింటి మీద ఎందు కు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యలను బూతద్దంలో పెట్టి వివాదంగా మార్చిన వారికి వత్తాసు పలుకుతూ కేసులు పెట్టారని మండిపడ్డారు. మహిళనైన తన మీద  సామాజిక మాధ్యమాల వేదికగా సాగుతున్న  దాడి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తనను అరెస్టు చేయలేరంటూ పోలీసులకు సవాల్‌ చేయడం గమనార్హం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top