
Actress Madhavi Gogate Died Due To Coronavirus: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో ప్రముఖ సినీ, టీవీ నటి మాధవీ గోగటే(58) కన్నుమూశారు. మరాఠి చిత్ర పరిశ్రమకు చెందిన నటి మాధవి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మృతికి బాలీవుడ్ టీవీ, సినీ పరిశ్రమకు చెందని పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి
కాగా మాధవీ పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో తల్లి పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందారు. అశోక్ సరాఫ్ సరసన మరాఠీ చిత్రం ‘ఘన్ చక్కర్’లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ‘తుజా మాజా జంటాయ్’ అనే మరాఠీ సీరియల్ బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఇక ‘ఐసా కభీ సోచా నా థా, కహిన్ తో హోగా, కోయి అప్నా సా’ వంటి సీరియల్స్ నటించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.