Actress Hamsa Nandini Shares About Her Cancer Treatment, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Hamsa Nandini: '16 సైకిల్స్‌ పాటు కీమో థెరపీ చేశారు.. కానీ ఇంకా గెలవలేదు'

Feb 24 2022 3:38 PM | Updated on Feb 24 2022 5:00 PM

Actress Hamsa Nandini Shares About Her Cancer Treatment, Post Goes Viral - Sakshi

Actress Hamsa Nandini Shares About Her Cancer Treatment: ప్రముఖ టాలీవుడ్‌ నటి హంసా నందిని ఇటీవలె క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తన పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోస్ట్‌ను షేర్‌ చేసింది. 16సైకిల్స్‌ పాటు కీమో థెరపీ చేశారు. ఇప్పుడు నేను అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ చికిత్స ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా గెలవలేదు. తదుపరి పోరాటానికి నేను సన్నద్దం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది అంటూ ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్‌ చేసింది.

ఇది చూసిన నెటిజన్లు మీరు మరింత బలంగా తిరిగొస్తారు. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ పేర్కొన్నారు. కాగా ఆర్యన్‌ రాజేశ్‌ హీరోగా వచ్చిన ‘అనుమానస్పదం’ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన హంసానందిని.. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో గుర్తింపు పొందింది. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement