భర్తతో విడిపోయిన హీరోయిన్‌.. కూతురితో కలిసి.. | Actress Bhama Confirms Separation From Husband, Shares Post | Sakshi
Sakshi News home page

భర్తతో విడిపోయిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఒంటరినే అంటూ పోస్ట్‌

Published Wed, May 8 2024 4:18 PM | Last Updated on Wed, May 8 2024 6:43 PM

Actress Bhama Confirms Separation From Husband, Shares Post

పెళ్లి చేసుకునేది కలకాలం కలిసుండటానికే! విడిపోతారని ముందే తెలిస్తే పెళ్లెందుకు చేసుకుంటారు? ప్రేమ దగ్గరే ఆగిపోతారు. అయినా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న ఎంతోమంది పలు కారణాల వల్ల ఆ బంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అందులో మలయాళ హీరోయిన్‌ భామ కూడా చేరింది. భర్తతో విడిపోయిన విషయాన్ని తొలిసారి అధికారికంగా వెల్లడించింది.

సింగిల్‌ మదర్‌ అయ్యాకే..
ప్రస్తుతం తాను సింగిల్‌ పేరెంట్‌ అని తెలిపింది. ఈమేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. 'నేను చాలా స్ట్రాంగ్‌ అని ఇంతవరకూ తెలీలేదు. సింగిల్‌ మదర్‌ అయిన తర్వాతే ఈ విషయం తెలిసొచ్చింది. ఇప్పుడు ధృడంగా నిలబడటమే నా ముందున్న ఏకైక ఛాయిస్‌. నా కూతురికి నేను.. నాకు నా కూతురు' అంటూ తన పాపతో ఆడుకుంటున్న ఫోటో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన జనాలు నువ్వు చాలా ధైర్యవంతురాలివి.. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అని కామెంట్లు చేస్తున్నారు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం
కాగా భామ.. 2020లో అరుణ్‌ జగదీశ్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. గత కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలను షేర్‌ చేయడమే మానేసింది నటి. ఇంతలోనే తను భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈమె తెలుగులో మంచివాడు అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది.

 

 

చదవండి: తమిళంలో ఇటీవలే రిలీజ్‌.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement