‘పుష్ప’తో నటిగా మంచి గుర్తింపు లభించింది: అక్షర

Actress Akshara Latest Movie Updates - Sakshi

టాలెంటెడ్ ఉంటే తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయి అంటుంది నటి అక్షర. పుష్ప చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ తెలుగమ్మాయి. కల్యాణ్‌ రామ్‌ ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ చిత్రంలో పెళ్లి కూతురి పాత్రలో నటించింది. ఆ తర్వాత రామ్‌ ‘రెడ్‌’ చిత్రంలో మంచి పాత్ర పోషించి, మెప్పించడంతో సుకుమార్‌ ‘పుష్ప’లో అవకాశం కల్పించాడు. 

ప్రస్తుతం పుష్ప పార్ట్‌ 2 చిత్రంతో పాటు రవితేజ, సుధీర్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న ‘రావణాసుర’లో ఓ విభిన్నమైన రోల్‌లో నటిస్తోంది. తాజాగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేదే తన లక్ష్యమని పేర్కొంది. తనలో టాలెంట్‌ చూసి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తానని చెబుతోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top