అక్కినేని వారి గ్రాండ్‌ వెడ్డింగ్‌.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందంటే? | Actors Naga Chaitanya And Sobhita Dhulipala Wedding Streaming In This OTT Platform, Says Report | Sakshi
Sakshi News home page

Naga Chaitanya and Sobhita: చైతూ-శోభిత పెళ్లి వేడుక.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!

Nov 26 2024 9:11 PM | Updated on Nov 27 2024 11:15 AM

Actors Naga Chaitanya and Sobhita Dhulipala wedding streaming In This Ott

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య మరికొద్ది రోజుల్లో ఓ ఇంటివాడు కానున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా వీరి పెళ్లి వేడుక జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వేదికను సిద్ధం చేస్తున్నట్లు చైతూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అయితే వీరి పెళ్లి వేడుకను ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో ఓటీటీ రైట్స్‌కు ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. నాగ చైతన్య,  శోభితాల వివాహ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ. 50 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల గురించిన వార్తలను అక్కినేని ఫ్యామలీ ఇంకా ధృవీకరించలేదు.

అయితే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. చైతూ- శోభిత డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకోనున్నారు. తమ పెళ్లిని సింపుల్‌గానే నిర్వహించాలని నాగ చైతన్య కోరినట్లు ఇటీవల నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులను శోభిత, చైతూనే చూసుకుంటున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement