నటుడికి దేశాన్ని అప్పగించలేం! | Actor Prakash raj Sensational Comments On TVK Vijay | Sakshi
Sakshi News home page

నటుడికి దేశాన్ని అప్పగించలేం!

Apr 18 2026 9:24 AM | Updated on Apr 18 2026 11:39 AM

Actor Prakash raj Sensational Comments On TVK Vijay

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పళనిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో  సినీ నటుడు ప్రకాష్‌ రాజ్, ప్రస్తుత ఎన్నికలను మూడు రకాల రాజకీయ నమూనాలుగా అభివర్ణిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిండుగల్‌ జిల్లా పళనిలో సీపీఐ అభ్యర్థి పాండికి మద్దతుగా ప్రచార సభలో ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ద్రావిడ మోడల్‌ అన్నది విద్యను అందించే, భాషను రక్షించే, గౌరవాన్ని కాపాడే మోడల్‌ అని ఆయన కొనియాడారు. అడిమై(బానిస) మోడల్‌ అన్నది  తమిళుల ఆత్మగౌరవాన్ని మోదీ పాదాల చెంత పెట్టే మోడల్‌ అని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వస్తే తమిళనాడుకు తీరని అన్యాయం జరుగుతుందని, దానికి ఈ బానిస మోడల్‌ మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. మరొకటి సినిమా మోడల్‌ అంటూ నటుడు విజయ్‌ పార్టీని ఉద్దేశిస్తూ.. వ్యాఖ్యలు చేశారు. సినిమాలో ఒకే పాటలో డాక్టర్, ఇంజినీర్‌ లేదా ముఖ్యమంత్రి అయిపోవచ్చని, అయితే నిజ జీవితం వేరు అని ఎద్దేవా చేశారు.

విజయ్‌పై నేరుగా విమర్శలు  
నటుడు విజయ్‌ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రకాష్‌ రాజ్‌ కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. ‘భాషకు లేదా ప్రజల ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు ఆ నటుడు (విజయ్‌) ఎప్పుడైనా వచ్చి నిలబడ్డారా అంటూ, నటుడి కోసం థియేటర్లో ఈలలు వేయడం వేరు, కానీ దేశ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టడం వేరు. అని వ్యాఖ్యలు చేశారు.  

విభజన రాజకీయాలపై హెచ్చరిక 
మణిపూర్‌ తరహాలో మధురైను మార్చాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మధురై తర్వాత వారి కన్ను పళనిపైనే ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికలు కేవలం పారీ్టల మధ్య పోరాటం కాదని, ఐక్యతకు, విభజనవాదానికి మధ్య జరుగుతున్న యుద్ధమని  పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై విజయ్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తీవ్రంగా స్పందిస్తుండడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement