నా కూతురిని బతికించుకుంటాను : పావలా శ్యామల

Actor Jeevan Kumar Helps To Pavala Syamala - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హాస్యనటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతుంది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు దాదాపు  250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు కూతురి అనారోగ్యంతో పావలా శ్యామల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ఆమెను ఆదుకోవడానికి మెగాస్టార్‌ చిరంజీవి సహా ఇండస్ర్టీకి చెందిన కొందరు ముందుకు వచ్చారు.

తాజాగా నటుడు జీవన్‌ కుమార్‌ కూడా పావలా శ్యామలకు సాయమందించారు. ఆమె పరిస్థితిని తెలుసుకొని స్వయంగా ఇంటికి వెళ్లిన ఆయన తనవంతు సాయాన్ని ఆమెకు అందించారు. ఈ నగరానికి ఏమైంది , ఫలక్నామా దాస్, సఫారీ వంటి సినిమాల్లో నటించిన  జీవన్ కుమార్ నిత్యావసరాలతో పాటు ప్రతి రోజు భోజన వసతి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఇక జీవన్‌ కుమార్‌ అందించిన సహాయంపై నటి పావలా శ్యామల స్పందించారు. స్వయంగా ఇంటికి వచ్చి డబ్బులివ్వడం సంతోషమని, ఇప్పుడు తనకు బతకాలనే ఆశ ఉందని, తన కూతుర్ని కూడా బతికించుకుంటానని పేర్కొంది. 

ఇటీవలె పావలా శ్యామల ఇబ్బందులు తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఆమెను కలిసి తన వంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అలాగే మా అసోసియేషన్‌ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమెకు సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు.ఇక ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్‌ హోటల్‌, గోలీమార్‌ వంటి సూపర్‌ చిత్రాల్లో నటించి పావలా శ్యామల గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

చదవండి : Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్‌ చిరంజీవి సాయం
పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top