ఆ హీరోయిన్‌తో పెళ్లి రూమర్లు: క్లారిటీ ఇచ్చిన హీరో!

Actor Baladitya Shocking Comments On Rumours About Love Affair With Heroine - Sakshi

బాలాదిత్య.. హీరోగా కెరీర్‌ ప్రారంభించడానికి ముందే బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో మెప్పించాడు. లిటిల్‌ సోల్జర్స్‌, జంబలకిడిపంబ హిట్లర్‌, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్‌, సమరసింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో నటనతో ఆకట్టుకున్న అతడు చంటిగాడు సినిమాతో హీరోగా మారాడు. ఆయన నటించిన అన్నపూర్ణమ్మ గారి మనవడు ఇటీవలే రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అతడు సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటిస్తూ బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నాడు.

ఇదిలా వుంటే 'చంటిగాడు' సినిమాలో తనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న సుహాసినిని బాలాదిత్య పెళ్లి చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దానిపై అతడు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుహాసిని, తాను మంచి స్నేహితులమని చెప్పాడు. తాము పెళ్లి చేసుకోబోతున్నామని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశాడు. ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ఇద్దరం ఒకే కారులో ప్రయాణించేవాళ్లమని, అది చూసి కొందరు తప్పుగా అనుకున్నారని తెలిపాడు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. మేం రెండు సినిమాల్లో కలిసి నటించేసరికి పెళ్లి చేసుకుంటున్నామంటూ వార్తలు రాసేశారు. కానీ మాకు అలాంటి అభిప్రాయమే లేదని తేల్చి చెప్పాడు. 

చదవండి: ప్రతిఒక్కరి జీవితానికి అన్వయించుకునే కథ అన్నపూర్ణమ్మ గారి మనవడు

ఐసీయూలో సినీ రచయిత, కేటీఆర్‌​ సాయం!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top