బాహుబలిలో ఆ డైలాగ్‌ చెప్పేటప్పుడు ప్రభాస్‌ నా దగ్గరకు వచ్చి..

Actor Aditya Shares Funny Incident With Prabhas During Baahubali - Sakshi

ప్రభాస్‌ అనగానే అందరికీ డార్లింగ్‌ అనే పేరే గుర్తొస్తుంది. అతని వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూసిన చాలామంది చెప్పే మాటిదే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటుడు ఆదిత్య ప్రభాస్‌ గురించి ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ని షేర్‌ చేసుకున్నారు. 'బాహుబలిలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. అందులో కాలకేయుడితో యుద్ధానికి వెళ్లేముందు మేకను బలిచ్చే సన్నివేశంలో...''యుద్ధానికి వెళ్లకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది .. పెనుముప్పు తప్పదు యువరాజా" అనేది నా డైలాగ్‌. అయితే ఆ డైలాగ్‌ చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్పాను.

దీంతో ప్రభాస్‌ నా దగ్గరికి వచ్చి...డార్లింగ్‌ ఏమనుకోకు..డైలాగ్‌ కొంచెం మెల్లిగా చెప్పవా..నా డైలాగ్  మరిచిపోతున్నాను అని అన్నారు. ఇది నా జీవితంలోనే మర్చిపోలేని ఘటన. నిజంగా ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి..ఆయన లాంటి వ్యక్తిని నేను నా లైఫ్‌లో ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. అంత స్టార్‌ స్టేటస్‌ ఉండి కూడా అందరితో ఎంతో సరదాగా కలిసిపోతారు. ప్రభాస్‌ క్యారవాన్‌ నుంచి దిగగానే అందరూ ఆయన కోసం ఎదురు చేస్తుంటారు. నిజంగానే ఆయన డార్లింగ్‌' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి : ప్రభాస్‌ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్‌
Rashmika Mandanna: డేటింగ్‌ అంటే ఏంటో తెలీదంటున్న రష్మిక

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top