BB Telugu 1 Fame Aadarsh ​​Balakrishna Says I Was Replaced From A Film After Testing For COVID-19 Positive - Sakshi
Sakshi News home page

కరోనా సోకిందని సినిమాలో నుంచి నటుడి తొలగింపు

Apr 19 2021 10:10 AM | Updated on Apr 19 2021 12:49 PM

Aadarsh Balakrishna: I Was Replaced From A Film After Testing Coronavirus Positive - Sakshi

. తనతోపాటు ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకిన విషయం సినిమా టీమ్‌కు చెప్పానని, అయితే వాళ్లు అండగా నిలబడాల్సింది పోయి తన స్థానంలో ఇంకో నటుడిని తీసుకున్నారట

కరోనా అందరి జీవితాలను తలకిందులు చేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుతున్న ఎంతోమంది ఆశలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసింది. కరోనా వైపరీత్యం వల్ల పలువురు నటీనటులు సినిమా అవకాశాలను కోల్పోతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ కంటెస్టెంట్‌ ఆదర్శ్‌ బాలకృష్ణ కూడా అదే కోవలోకి చేరాడు. కొద్ది రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతడి కుటుంబం మొత్తం కూడా కోవిడ్‌ బారిన పడింది. దీంతో పేరెంట్స్‌ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాడు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు.

ఈ సందర్భంగా తనను ఓ సినిమాలో నుంచి తీసివేశారని బాధపడ్డాడు. తనతోపాటు ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకిన విషయం సినిమా టీమ్‌కు చెప్పాడట ఈ నటుడు. అయితే వాళ్లు అండగా నిలబడాల్సింది పోయి తన స్థానంలో ఇంకో నటుడిని తీసుకున్నారట. కనీసం ఒక మాటైనా చెప్పకుండా ఇలా అర్ధాంతరంగా తనను సినిమా నుంచి తొలగించారని అభిమానులతో వాపోయాడు ఆదర్శ్‌. ఆదర్శ్‌కు జరిగిన అన్యాయానికి అభిమానులు చింతిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'ఇది కాకపోతే ఇంకొకటి.. టాలెంట్‌ ఉన్నవారికి అవకాశాలు ఎప్పటికైనా వెతుక్కుంటూ వస్తాయి' అని ఆదర్శ్‌కు ధైర్యం చెప్తున్నారు. 

చదవండి: ‘బిగ్‌బాస్‌’ బ్యూటీపై నెమలి దాడి.. వీడియో వైరల్‌

ఆ సినిమాను 267 సార్లు చూశాను: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement