సత్యదేవ్‌ పాన్‌ ఇండియా చిత్రం.. వేసవికి విడుదల | Sakshi
Sakshi News home page

Satyadev26 : సత్యదేవ్‌ పాన్‌ ఇండియా చిత్రం.. వేసవికి విడుదల

Published Thu, Dec 1 2022 8:29 AM

Satyadev Tamannaah Bhatia Gurthunda Seethakalam Gets Release Date - Sakshi

సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఎస్‌ఎన్‌.రెడ్డి (పద్మజ ఫిల్మ్స్‌), బాల సుందరం–దినేష్‌ సుందరం (ఓల్డ్‌టౌన్‌ పిక్చర్స్‌) నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ జరుపుకుంటోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ఫైనాన్షియల్‌ క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్నపాన్‌ ఇండియా చిత్రమిది.

2023 ఫిబ్రవరి మొదటివారంతో షూటింగ్‌ పూర్తవుతుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో వేసవిలో సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సుమన్‌ ప్రసార బాగే, కెమెరా: మణికంఠన్‌ కృష్ణమాచారి. 

Advertisement
 
Advertisement
 
Advertisement