కొల్చారం(నర్సాపూర్): బంజారా సామాజిక వర్గ అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ, సంస్కృతి ప్రచారం దిశగా ‘గోర్ సిక్వాడి– గోర్ మళవ్’ ముందడుగు వేస్తుందని గోర్ మేళా జాతీయ సదస్సులో వక్తలు తెలిపారు. కొల్చారంలో రెండు రోజులుగా కొనసాగుతున్న గోర్ మేళా జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గోర్ సేన ప్రతినిధులు తమ సామాజికవర్గ అభ్యు న్నతి కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలను సదస్సులో వివరించారు. బంజారా విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన కల్పించారు. భూమి, న్యాయ సహాయంలో భాగంగా గిరిజనుల భూ హక్కుల (పోడు భూముల) పరిరక్షణకు న్యాయ సహాయం అందించే దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న బంజారాలతో కలిసి సామాజిక ఐక్యత కోసం ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మేళాలో భా గంగా బంజారా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు.


