ప్రజలను వేధిస్తే ఊరుకోను
రామాయపేట(మెదక్): అభివృద్ధి పనుల విషయమై ఎవరూ అడ్డుకున్నా చర్యలు తీసుకుంటామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. మండలంలోని దంతేపల్లి సుభాశ్ తండాలో ఇటీవల మృతిచెందిన ప్రకా శ్ కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. అటవీ బీట్ అధికారి తప్పుడు కేసు లు నమోదు చేసి తమను వేధింపులకు గురిచేస్తున్నారని తండా వాసులతో పాటు కాట్రియాల గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఫోన్ చేసి సదరు అధికారిని తీవ్రస్థాయిలో మందలించారు. పద్ధతి మార్చుకోకపోతే ఊరుకోనని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, తండావాసులు కంలియా, రాంచందర్, పాండు, రాజు తదితరులు ఉన్నారు.
నర్సాపూర్ రూరల్: మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇటీవల మెదక్, తూప్రాన్‌లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి అండర్–14 వాలీబాల్ బాలికల జట్టుకు 9వ తరగతి విద్యార్థినులు అఖిల, శ్రీజ, వైష్ణవి సెలక్ట్ అయ్యారు. అండర్–17 రబ్బి జట్టుకు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఎన్. వందన, 9వ తరగతి విద్యార్థులు నందిని, సారిక, జిమ్నాస్టిక్స్ రాష్ట్రస్థాయికి మొదటి సంవత్సరం విద్యార్థిని వందన ఎంపికై ంది. జిల్లాస్థాయి అండర్ 17 అథ్లెటిక్స్‌కు 9వ తరగతి విద్యార్థిని హర్షిని 1,500 మీటర్ల పోటీలో గెలుపొందింది. ఎంపికై న విద్యార్థులను మంగళవారం ప్రిన్సిపాల్ లలితాదేవి, పీడీ సాలి, అధ్యాపక బృందం విద్యార్థులు అభినందించారు.
పాపన్నపేట(మెదక్): జిల్లాలో వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ఎస్‌ఈ నారాయణ నాయక్ అన్నారు. విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పాపన్నపేటలో పర్యటించారు. విద్యుత్ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించారు. వాటి వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. వదులుగా ఉన్న విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయాలన్నారు. ఆయన వెంట ఎస్‌ఏఓ మార్తయ్య, ఏడీఈ మోహన్‌బాబు, ఏఈ నర్సింలు, సబ్ ఇంజనీర్ సాయికుమార్, సిబ్బంది ఉన్నారు.
మెదక్ కలెక్టరేట్: బాలికలపై అత్యాచారాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని వైద్య విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సునీతాదేవి పేర్కొన్నారు. మంగళవారం పిల్లికోటాల్‌లో గల మాతా శిశు ఆస్పత్రిలో పోక్సో చట్టంపై ప్లాన్ ఇండియా, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లు సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీతాదేవి హాజరై మాట్లాడారు. ప్లాన్ ఇండియా సహకారంతో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పలు విభాగాల వైద్యులు పాల్గొన్నారు.
ప్రజలను వేధిస్తే ఊరుకోను
ప్రజలను వేధిస్తే ఊరుకోను
ప్రజలను వేధిస్తే ఊరుకోను


