కొనుగోళ్లు వేగవంతం చేయండి
కౌడిపల్లి(నర్సాపూర్)/చిలప్‌చెడ్: వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు నష్టం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని ముట్రాజ్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం తూకంతో పాటు రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి త్వరగా రైస్‌మిల్‌కు తరలించాలని ఆదేశించారు. సమస్యలుంటే తెలియజేయాలని సూచించారు. అనంతరం చిట్కుల్ గ్రామ శివారులోని కేజీబీవీని సందర్శించారు. పాఠశాల ఆవరణ, విద్యార్థుల బోధనా నైపుణ్యాలను, వంటగదిని పరిశీలించారు. మౌలిక వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి అంజలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్


