‘కపాస్ కిసాన్’పై అవగాహన కల్పించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
టేక్మాల్(మెదక్): గ్రామాల్లోని రైతులకు కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకరంపేట్ డివిజన్ పరిధిలో మొత్తం 21,193 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారని తెలిపారు. ప్రతి గ్రామంలో రైతులకు వ్యవసాయ అధికారులు యాప్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దళారులకు పంటను అమ్మి మోసపోకుండా కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్లి మద్దతు ధర పొందాలని సూచించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను మానిటరింగ్ చేసేందుకు ఏఎంసీల వారీగా లోకల్ కమిటీలను నియమించాలన్నారు. లీగల్ మెట్రాలాజీ అధికారులు తేమ కొలిచే యంత్రాలను పరిశీలించాలన్నారు. సీసీఐ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ జాతీయ ఆహార భద్రత పథకం కింద జొన్న విత్తనాలని 100% రాయితీపై రైతులకి అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, ఇన్‌చార్జి ఏడీఏ రాంప్రసాద్, తహసీల్దార్ తులసీరాం, ఏపీఎం గోపాల్, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


