15న లోక్ అదాలత్: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో వ్యవహరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులు, కోర్ట్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు న్యాయవ్యవస్థతో సమన్వయం అవసరమన్నారు. అనంతరం జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు. ఇందులో రాజీ పడదగిన కేసులను గుర్తించి ఈనెల 15న నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అద నపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.


