పేదలకు కడుపునిండా సన్న బువ్వ
మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు
మెదక్‌జోన్/హవేళిఘణాపూర్/రామాయంపేట: రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. బుధవారం పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలోని రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు సన్నబియ్యం తినాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం అన్నారు. సన్నధాన్యం కొనుగోలు చేసి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలిచిచామన్నారు. అంతేకాకుండా ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో దాదాపు రూ. వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబుతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హవేళిఘణాపూర్‌లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడాదిలోపే రైతులకు రుణమాఫీ, రైతు భరోసాను అమలు చేసినట్లు తెలిపారు. అలాగే రామాయంపేట మున్సిపాలిటీలోని రేషన్ దుకాణాల్లో ఎమ్మెల్యే నన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. అనంతరం దామరచెరువు గ్రామంలో రూ. 1.95 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు రూ. 14.50 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సుప్రభాత్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు యుగేందర్‌రావు, నాయకులు పాల్గొన్నారు.


