ఆదిలాబాద్‌లో కలకలం | - | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌లో కలకలం

Nov 24 2026 11:56 PM | Updated on Nov 24 2026 11:56 PM

ఆదిలాబాద్‌టౌన్‌: బీరు సీసాతో ఓ వ్యక్తిపై జరిగిన దాడి ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌక్‌ వద్ద ఉన్న వైన్స్‌ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన అతీఖ్‌ ఖురేషిపై అదే కాలనీకి చెందిన షీన్‌ బీరుసీసాతో దాడికి పాల్పడ్డాడు. అతనితో పాటు మరో వ్యక్తి అమాన్‌ ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ దాడిలో అతీఖ్‌ ఖురేషికి తీవ్ర గాయాలై రోడ్డుపై కుప్పకూలిపోవడంతో నిందితులు పరారయ్యారు. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement