శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 భూగర్భ గనిని మంచిర్యాల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్‌మేజిస్ట్రేట్, సీనియర్ సివిల్ జడ్జి నిరోష మంగళవారం సందర్శించారు. గని అధికారులతో కలిసి భూగర్భంలోకి దిగి పని ప్రదేశాలను పరిశీలించారు. మైనింగ్ వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. బొగ్గు ఉత్పత్తి వివరాలు, ఉద్యోగుల పని విధానం, రక్షణకు యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను గని మేనేజర్ తిరుపతి వివరించారు. చీకటి గదిలో ఉద్యోగులు కష్టాన్ని ప్రత్యక్షంగా చూడడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ వెంకట్ రామ్, సీనియర్ పీవో సంతన్, తదితరులు పాల్గొన్నారు.


