జైపూర్: మండల కేంద్రంలోని వెలిశాల మల్లన్న ఆలయంలో కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూర్ వాస్తవ్యులు పోటు ప్రతాప్‌రెడ్డి, దేవేంద్ర ఆధ్వర్యంలో ఒగ్గు పూజారులు పెద్దపట్టం వేసి మల్లన్న, కేతమ్మ, భ్రమరాంభికల కల్యాణం జరిపించారు. ఒగ్గు పూజారుల ఢమరుకాల మోతలతో అటవీప్రాంతం మార్మోగింది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొంతమంది బోనం పోసి, పట్నాలు వేశారు. కార్యక్రమంలో ఒగ్గు పూజారులు డేగ రమేశ్, చీర్ల గట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.


