ఆదివాసీ సంస్కృతికి ప్రతీక దండారీ | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ సంస్కృతికి ప్రతీక దండారీ

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

● ఆటాపాటలతో అలరించే గిరిజన పండుగ ● తరతరాలుగా వస్తున్న ఆచారాలకు ప్రతిరూపం

సాత్నాల: మండలంలోని జామిని, దుబ్బగూడా, ఖరా, సైద్పూర్‌, దుబ్బగూడా, టెమ్రి గూడ గ్రామాల్లో 45 రోజులు దండారీ నిర్వహిస్తున్నారు. ఆదివా సీ సంస్కృతి సంప్రదాయాలకు దండారీ పండుగ అద్దం పడుతోంది. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు కొనసాగిస్తూ, ఆటాపాటలు, సంప్రదాయ నృత్యాలతో గిరిజనులు ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆదివాసీల జీవన విధానం, ఐక్యమత్యం, కళా వైభవాన్ని చాటి చెప్పే దండారీ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.

సంప్రదాయ నృత్యాలు

సంప్రదాయ వేషధారణ, డప్పులు, ఇతర వాయిద్యాల నడుమ గిరిజనులు చేసే నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యువకులు, పెద్దలు బృందాలుగా ఏర్పడి పాటలు పాడుతూ లయబద్దంగా నృత్యలు చేస్తారు. గ్రామాల మధ్య పరస్పర సందర్శనలు, సామూహిక వేడుకతో పండగ వాతావరణం నెలకొంటుంది. ఒక్కో గిరిజన తెగకు ప్రత్యేక ఆచారాలు, కళారూపాలు ఈ వేడుకల్లో ప్రతిబింబిస్తాయి.

భావితరాలకు అందించాలి

ఆధునికత ప్రభావంతో సంప్రదాయ కళలు కనుమరుగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యువత దండారీ నృత్యాలు, పాటలు, ఆచారాల విశిష్టత తెలుసుకుని భావితరాలకు అందించాలని గిరిజన సంస్కృతి పరిరక్షకులు ఆకాంక్షిస్తున్నారు. ఆదివాసీ ప్రత్యేక గుర్తింపును చాటిచెప్పే దండారీ పండుగకు ప్రోత్సాహం అందిస్తే గిరిజన కలలు సంప్రదాయాలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement