ఎస్టీపీపీలో బతుకమ్మ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఎస్టీపీపీలో బతుకమ్మ వేడుకలు

Oct 18 2026 1:48 AM | Updated on Oct 18 2026 1:48 AM

జైపూర్‌: ఎస్టీపీపీ పరిపాలన భవనం వద్ద బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగపై నిర్వహించిన క్విజ్‌లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఎస్టీపీపీ జీఎం కె.సూర్యనారాయణరాజు హాజరై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు. జీఎం (ఫైనాన్స్‌) ఈ.భీభత్స, ఏఐటీయూసీ ఫిట్‌ సెక్రటరీ సత్యనారాయణ, సీఎంఓఏఐ బ్రాంచి ప్రెసిడెంట్‌ డి. పంతులా, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement