● నకిలీ ప్లింత్ ఏరియా సర్టిఫికెట్ తయారు చేసిన ఇద్దరి అరెస్ట్
నస్పూర్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో కమిషనర్, సంబంధిత అధికారుల ఫోర్జరీ సంతకాలతో నకిలీ ప్లింత్ ఏరియా సర్టిఫికెట్లు తయారు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తౌసినొద్దీన్ తెలిపారు. శనివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం..సీసీసీ నస్పూర్ తీగలపహాడ్కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. మంచిర్యాల భగవంతం వాడకు చెందిన గాదాసు శివకుమార్, బెల్లంపల్లి మున్సిపాలిటీలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఎండీ ఇర్ఫాన్లు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ప్లింత్ ఏరియా సర్టిఫికెట్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారి వద్ద డబ్బులు తీసుకుని నకిలీ దందాకు తెరలేపారు. అధికారుల సంతకాలు ఫోర్జరీ, రబ్బర్స్టాంప్లు తయారు చేస్తున్న శివకుమార్, ఇర్ఫాన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మహిళపై కత్తితో
దాడిచేసిన ఒకరిపై కేసు
కాసిపేట: మహిళపై కత్తితో దాడిచేసిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మల్కేపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల అనూష తోటి మహిళలతో శుక్రవారం రాత్రి బతుకమ్మ ఆడుతోంది. అదే గ్రామానికి చెందిన పోతరవేణి మల్లేశ్ సౌండ్ తక్కువ ఎందుకు పెడుతున్నారు, మేము డబ్బులు ఇవ్వలేదా సౌండ్ పెంచండి అంటూ ఇష్టం ఉన్నట్లు బూతులు తిట్టాడు. రాత్రి ఇంట్లో నుంచి కత్తి తీసుకువచ్చి దాడి చేయడంతో అనూషకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పేకాటస్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి
జన్నారం: మండలంలోని కలమడుగు శివారులో శనివారం పేకాటస్థావరంపై రామగుండం కమిషనరేట్ టాస్క్ఫొర్స్ పోలీసులు దాడి చేశారు. టాస్క్ఫోర్స్ ఎస్సై దీకొండ రమేశ్ తె లిపిన వివరాల ప్రకారం.. కలమడుగు శివా రులో డబ్బులు పందెం పెట్టి పేకాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. నార్కోటిక్ టీమ్/టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు దీకొండ రమేశ్, లచ్చ న్న, ఆర్ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది దాడి చేశారు. పేకాడుతున్న 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.42,040 నగదు, 8 సెల్ఫోన్లు, 3 బైక్లను జన్నారం పోలీస్ స్టేషన్కు అప్పగించారు.


