వేలాలకు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

వేలాలకు మహర్దశ

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

● పుష్కరాల వేళ రూ.20కోట్లతో పనులు ● ఇప్పటికే రూ.14.50 కోట్లు మంజూరు

జైపూర్‌: ఉత్తర తెలంగాణలో మరో కొమురవెల్లి మల్లన్నగా వెలుగొందుతున్న వేలాల మల్లన్నస్వామి ఆలయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న వేలాల గ్రామానికి గోదావరి పుష్కరాలతో నిధుల వరద కురవనుంది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో వేలాల ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా వేలాల పుష్కరఘాట్‌తో పాటు ప్రసిద్ధిగాంచిన మల్లికార్జున స్వామి (కింద) ఆలయం, గట్టు మల్లన్న స్వామి (గుట్టపై న) ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటా యించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొ త్తంగా రూ.20కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప నులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు త యారు చేశారు. ఇప్పటికే రూ.14.50కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో వేలాల ప్రాంతం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది.

భక్తులకు సరిపడా వసతులు

పన్నెండేళ్లకోసారి నిర్వహించే గోదావరి పుష్కరాలు 2027లో నిర్వహించనుండగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. తెలంగాణ ప్రభుత్వం పుష్కరా లను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణా ళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అధికారులు వేలాల మల్లన్న స్వామి, గట్టు మల్లన్న స్వామి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించా రు. ఆలయ పరిసరాలను సుందరీకరించడం, భక్తులకు సౌకర్యాలు కల్పించడం, అవసరమైన మౌలిక వసతులు మెరుగుపర్చడం ద్వారా ఆలయాలకు కొత్త కళ తీసుకురానున్నారు. పుష్కరాల సమయంలో అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు.

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా..

గోదావరి తీరంలోని వేలాలకు ఇప్పటికే ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఏటా మహాశివరాత్రికి ఇక్కడ నిర్వహించే జాతరకు లక్షల్లో భక్తులు తరలివస్తారు. ప్రతీనెల నిర్వహించే గిరిప్రదక్షిణలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం పుష్కరాలకు వచ్చే భక్తులకు వసతుల కల్పనతోపాటు మల్లన్నస్వామి, గట్టు మల్లన్నస్వామి ఆలయాల అభివృద్ధి పనులు పూర్తి చేస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. దీంతో ఈ ప్రాంతంఆఽధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెంది వ్యాపార, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement