పుష్కరాలకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతుల కల్ప నకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా గ్రామంలో రూ.5.10కోట్లతో అంతర్గత సిమెంట్ రోడ్లు, రూ.4.25కోట్లతో పుష్కరఘాట్, రూ.2.80కోట్లతో ఆర్వో ప్లాంట్లు, వాటర్ ట్యాంక్‌లు, టాయిలెట్స్ ఇతర వసతులు, రూ.2కోట్లతో విద్యుత్, శానిటేషన్ పనులు, రూ.2,30కోట్లతో గుట్ట కింద, పైన ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం వసతి కల్పన తదితర పనులు చేపట్టనున్నారు. ఇవే కాకుండా.. ఆలయం వద్ద, గోదావరి తీరం పుష్కరఘాట్ వద్ద సుమారు మూడెకరాల భూమి కొనుగోలు చేసి భక్తులకు పర్మినెంట్‌గా వసతి కల్పనతో పాటు అన్నిరకా ల సౌకర్యాలు కల్పించడానికి సుమారు రూ.2.30 కోట్ల అంచనాలు తయారు చేశారు.


