అనుమతి లేని అంతస్తుకు భారీ జరిమానా | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేని అంతస్తుకు భారీ జరిమానా

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

బెల్లంపల్లి: పట్టణంలో అనుమతి లేకుండా రెండో అంతస్తు నిర్మాణం చేపట్టిన ఓ భవన యాజమానురాలికి శనివారం మున్సిపల్‌ అధికారులు భారీ జరి మానా విధించారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్‌ బస్తీకి చెందిన దొంగల భాగ్యలక్ష్మి అనుమతించిన నిర్మాణ విస్తీర్ణానికి అదనంగా రెండో అంతస్తు నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. నిర్మాణ విలువను రూ.23,16,600గా లెక్కించి 25శాతం జరిమానా రూ.5,79,150 విధించారు. అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement