కేటాయిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు ఇదివరకే ఓటర్ల జాబితా వెల్లడి రాత్రికి కొలిక్కిరానున్న యూనియన్ల పొత్తులు డిపోల బాట పట్టనున్న యూనియన్ల నేతలు
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోటీ చేసే యూనియన్లకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తూ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో పోటీకి అనుమతి లభించడంతో న్యాయపరమైన చిక్కులు తొలగి ఎన్నికలకు మార్గం సుగమమైంది. అక్టోబర్ 9న పోలింగ్, 17న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నికలు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్ హక్కులతోపాటు యూనియన్ల ప్రాతినిధ్యం దృష్ట్యా కీలకం కానున్నాయి. 12 యూనియన్లు బరిలో నిలవడం, గుర్తుల కేటాయింపుతో ఎన్నికల ప్రచారం మొదలైంది.
గుర్తులు ఇలా..
ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు బతుకమ్మ గుర్తు, తెలంగాణ మజ్దూర్ యూని యన్‌కు నిచ్చెన, బహుజన వర్కర్ యూనియన్‌కు కత్తెర, ఈయూకు బస్సు, కార్మిక పరిషత్‌కు బస్సు టైర్, కార్మిక సంఘ్‌కు పులి, బహుజన కార్మిక యూ నియన్‌కు ధర్మచక్రం, తెలంగాణ ఆర్టీసీ వర్కర్ యూనియన్‌కు విల్లు, బాణం, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌కు నక్షత్రం, నేషనల్ మజ్దూర్ యూనియ న్‌కు చేతిలో దివిటీ, మషాల్, స్టాఫ్ వర్కర్ యూని యన్‌కు తరాజు, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్‌కు గద గుర్తు కేటాయించారు.
మంచిర్యాల డిపోలో అత్యధిక ఓటర్లు
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ యూనియన్ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా విడుదల చేసింది. రీజియన్ వ్యాప్తంగా 1773 మంది అర్హులైన ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు 1703 కాగా 70 మంది కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ వేజేస్ ఉద్యోగులు ఉన్నారు. అత్యధిక ఓటర్లు కలిగిన డిపో మంచిర్యాల కాగా ఉట్నూర్ డిపోలో అత్యల్ప ఓటర్లు ఉన్నారు.


