తెలంగాణ ఉద్యమ కళాకారుడు రెడ్డి పోశం మృతి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమ కళాకారుడు రెడ్డి పోశం మృతి

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి

బెల్లంపల్లి: తెలంగాణ ఉ ద్యమ జానపద కళాకా రుడు రెడ్డి పోశం (49) అకాల మరణం చెందా డు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామాని కి చెందిన పోశం తీవ్ర అనారోగ్యంతో బాధ ప డుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. పోశం మృతి చెంది నట్లు తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర జానపద కళా కారుల సంఘం తీవ్ర సంతాపం తెలిపింది. సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్‌ ఇతర కళాకారులు, పలువురు నాయకులు శనివారం పోశం మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కళాకా రులు మాట్లాడు తూ.. తెలంగాణ మ లిదశ ఉద్యమంలో తన ఆట, పాటలతో పోశం ప్రజలను చైతన్యపరిచాడని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పోశంకు తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్‌గౌడ్‌ ఇటీవల రూ.10వేల ఆర్థికసాయం అందించినట్లు గుర్తుచేశారు. పోశం అకాల మరణం జానపద కళారంగానికి, తెలంగాణ ఉద్యమ కళాకారులకు తీరని లోటని కొనియాడారు. కళాకారులు జంజర్ల దినేశ్‌కుమార్‌, అడెపు సమ్మయ్య, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement