గెలుపే లక్ష్యం కావాలి
దండేపల్లి: క్రీడాకారులు గెలుపు లక్ష్యంతో ముందుకుసాగాలని రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలోని తాళ్లపేటలో గురువారం జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించా రు. విజేతలకు తిరుపతి చేతుల మీదుగా బహుమతులు అందించారు. తిరుపతి మా ట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి కంది సతీశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, నాయకులు కాంతరావు, జంగు, సల్లు, తిరుపతి శ్రీధర్, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


