ఇలా వచ్చారు.. అలా వెళ్లారు | - | Sakshi
Sakshi News home page

ఇలా వచ్చారు.. అలా వెళ్లారు

Jan 17 2026 7:26 AM | Updated on Jan 17 2026 7:26 AM

ఇలా వచ్చారు.. అలా వెళ్లారు

ఇలా వచ్చారు.. అలా వెళ్లారు

● ఆదిలాబాద్‌లో సీఎం పర్యటన ● పెన్‌గంగ నీటిని మెయిన్‌ కెనాల్‌లోకి విడుదల ● రూ.1,891 కోట్ల అంచనా వ్యయంతో కొరాట–చనాక బ్యారేజ్‌ నిర్మాణం కోసం పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరి గిందన్నారు. 5.12 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేయబడినట్లు చెప్పారు. దీని ద్వారా ఆదిలా బాద్‌ రూరల్‌, భీంపూర్‌, జైనథ్‌, బేల మండలాల్లోని 89 గ్రామాల్లో 51వేల ఎకరాలకు సాగునీరు, ఈ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ● ఆయకట్టుకు నీటిని అందించేందుకు డీ–14 నుంచి డీ–19 వరకు ఉప కాలువల నిర్మాణ పనులు చేపడతామని, ప్రాజెక్టులో భాగంగా నీటిని నిల్వ చేసేందుకు పిప్పల్‌కోటి బ్యాలెన్సింగ్‌ జలాశయం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వివరించారు. కొరాట–చనాక బ్యారేజ్‌కు అనుబంధంగా ప్రధాన కాలువ, మోటార్లతో పంప్‌హౌస్‌ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాంసి, భీంపూర్‌ మండలాల్లోని 15 గ్రామాల్లో 13,500 ఎకరాల నూతన ఆయకట్టును వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు రూ.368 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు సీఎం వివరించారు. ● అభివృద్ధి పనుల కోసం 3,313 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా, ఇప్పటివరకు 1,545 ఎకరాల భూమి సేకరించినట్లు తెలి పారు. రూ.117 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ప్రధాన కాలువ నిర్మాణంలో భాగంగా 138 కట్టడాలు చేపట్టినట్లు, సాత్నాల వద్ద నదిపై 1.675 కిలో మీటర్ల మేర నిర్మించిన ప్రీకాస్ట్‌ పోస్టుటెన్షన్డ్‌ వయాడక్ట్‌ కోసం రూ.259.81 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉప కాలువల నిర్మాణం చేపట్టి ఆయకట్టు విస్తీర్ణం పెంపొందించడంతో రైతులకు మేలు జరుగుతుందని వివరించారు.

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప ర్యటన చడీచప్పుడు లేకుండా సాగింది. ఇలా వ చ్చారు.. అలా వెళ్లారన్నట్టుగా కొనసాగింది. శు క్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆయన హెలిక్యాప్టర్‌ ద్వారా నేరుగా భోరజ్‌ మండలం హత్తిఘాట్‌కు చేరుకున్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. సీ ఎంకు ఎంపీ నగేశ్‌, ఎమ్మెల్యేలు శంకర్‌, అనిల్‌ జాదవ్‌, కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ అఖిల్‌ మహాజ న్‌, ఇతర అధికారులు, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు స్వాగతం పలికారు. అరగంట మాత్రమే ఆ యన జిల్లాలో గడిపారు. కొరటా–చనాక పంప్‌హౌస్‌ వద్ద మీట నొక్కి పెన్‌గంగ జలాలను ప్రధాన కాలువలోకి వదిలారు. ఆ తర్వాత అందులో పారుతున్న గంగాజలాలకు పూజలు చేశా రు. పూలు, చీరసారెలు అందులోకి వదిలారు. అనంతరం హత్తిఘాట్‌లో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్‌కు తిరిగి చేరుకు అక్కడి నుంచి నిర్మల్‌ బయల్దేరి వెళ్లారు. పెన్‌గంగ జలాలను ప్రధాన కాలువలోకి విడుదల చేసిన సందర్భంగా సీఎం మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు..

ఫొటో స్టాల్‌ సందర్శన..

హత్తిఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో నేరుగా హెలిక్యాప్టర్‌ నుంచి దిగిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి ప్రత్యేకంగా నిర్మించిన రోడ్డు మా ర్గం ద్వారా పంప్‌హౌస్‌ వద్దకు చేరుకున్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో స్టాల్‌ను సందర్శించారు. నీటి విడుదలకు సంబంధించిన వి వరాలను కలెక్టర్‌, నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులకు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement