కోలిండియాలో సింగరేణి కళాకారుల ప్రతిభ
మందమర్రిరూరల్: మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో డబ్యూసీఎల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కోలిండియా పోటీల్లో సింగరేణి కళాకారులు పలు విభాగాల్లో ప్రతి భ కనబరిచి పతకాలు సాధించారు. సాంస్కృతిక పోటీల్లో 10 జట్లు పాల్గొన్నాయి. సింగరే ణి తరఫున మందమర్రి ఏరియా నీలాల శ్రీని వాస్ సాంస్కృతిక విభాగం టీం జానపద నృత్యంలో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించిన ట్లు టీం మేనేజర్ కార్తిక్, కోచ్ అశోక్ తెలిపా రు. కూచిపూడి నృత్యంలో ఏ శ్రీనివాస్ (భూపాలపల్లి) గోల్డ్ మెడల్, కర్ణాటక సంగీతంలో బీ శ్రీనిధి, (ఎస్టీపీపీ) గోల్డ్ మెడల్, ఫ్లూట్ వి భాగంలో రవీంద్రకుమార్(ఎస్టీపీపీ), బ్రాంజ్ మెడల్, వయోలిన్ విభాగంలో రవికుమార్ (కార్పొరేట్) బ్రాంజ్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. వీరికి ఏరియా జీఎం రా ధాకృష్ణ, డబ్యూపీఎస్ అండ్ జీఏ కమిటీ, అధికారులు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు.


