నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
చెన్నూర్: నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం మంత్రి చెన్నూర్ మున్సిపాలిటీ పరిధి లోని 18వార్డుల్లో రూ.15కోట్ల నిధులతో రోడ్లు, డ్రై నేజీల నిర్మాణానికి కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధి లోని ఆరోవార్డులో రూ.1.47కోట్లు, 14వ వార్డులో రూ.98లక్షలు, ఏడోవార్డులో రూ.1.63 కోట్లు, 15వ వార్డులో రూ.69లక్షలు, 16వ వార్డులో రూ.62లక్షలు, 17వ వార్డులో రూ.61లక్షలు, 12వ వార్డులో రూ.68లక్షలు, 13వ వార్డులో రూ.1.40 కోట్లు, ఐదో వార్డులో రూ.1.32 కోట్లు, నాలుగో వార్డులో రూ.43లక్షలు, 18వ వార్డులో రూ.27లక్షలు, తొమ్మిదో వార్డులో రూ.20లక్షలు, 11వ వార్డులో రూ.83లక్షలు, 10వ వార్డులో రూ.42లక్షలు, మూ డోవార్డులో రూ.29లక్షలు, రెండోవార్డులో రూ.38 లక్షలు, ఒకటోవార్డులో రూ.28లక్షలు, ఎనిమిదో వార్డులో రూ.51లక్షల నిధులతో చేపట్టిన అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. త్వరగా పనులు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఏఈలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం
రామకృష్ణాపూర్: బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యమని మంత్రి వివేక్ ఆరోపించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమా రు రూ.7కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల ని ర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, అర్హులందరికీ పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అమృత్ స్కీం ద్వా రా చేపడుతున్న పనులు మరో ఆరునెలల్లో పూర్తి చేసి ఇంటింటికీ తాగనీరు ఇస్తామని చెప్పారు. క్యా తనపల్లిలో ఇప్పటికే రూ.45కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మున్సిపల్ ఎ న్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అ భివృద్ధి సాధ్యమని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ రాజు, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, నాయకులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివా స్, వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


