హామీలు అమలు చేయాలి
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో శుక్రవా రం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జి ల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ కలి సి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో శాశ్వత డంప్‌యార్డు ఏర్పాటు చేయాలని, లక్ష్మీ టాకీస్ నుంచి రాజీవ్‌నగర్ వరకు రైల్వే వంతెన, గో దావరి నదిపై వంతెన, కాలనీల్లో డ్రెయినేజీలు, రోడ్లు నిర్మించాలని, సింగరేణి పట్టాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజమనో హర్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు గాజుల ముఖేశ్‌గౌడ్, రంగ శ్రీశైలం, అమి రిశెట్టి రాజ్‌కుమార్, సత్రం రమేశ్, చక్రవర్తి, కృష్ణమూర్తి, అశోక్‌వర్ధన్, సతీశ్‌రావు, రాంచందర్, రాకేశ్ రెన్వా, తిరుమల, సరస్వతి, స్వామిరెడ్డి, అశ్విన్‌రెడ్డి తదితరులున్నారు.


