మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో భూ సమస్యల పరి ష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని క లెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్‌తో కలిసి మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు, తహసీల్దార్లు, పోలీసు అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో విచా రించాలని, కనీసం 15 రోజులు, గరిష్టంగా 21రో జులుగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకో వాలన్నారు. కోర్టులో పరిష్కారమయ్యే సమస్యల పై అర్జీదారులకు అవగాహన కల్పించి తగు సూచనలు చేయాలన్నారు. డివిజన్ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను మండల స్థాయి కమిటీకి సిఫారసు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాస్థాయి కమి టీలో కలెక్టర్, డీసీపీ పరిధిలో మండల, సబ్ డివిజన్ స్థాయి దరఖాస్తుల ప్రక్రియపై సమీక్షించి దరఖాస్తుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డీసీపీ మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి, రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
రక్తదానానికి ముందుకు రావాలి
కాసిపేట: రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రా వాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమగూడెం, బెల్లంపల్లి జాతీయ రహదారి పక్కనున్న కల్వ రీ మినిస్ట్రీ చర్చీలో ప్రవీణ్, షారోన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రక్తదాన శిబిరాలతో సికిల్‌సెల్, తలసేమి యా వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడటం జరుగుతుందన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఆస్పత్రి, నిత్యాన్నదానం ఏర్పాటు
సిస్టర్ షారోన్ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేదల ఆకలి తీర్చేందుకు నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ కుమార్ దీపక్


